


Pregnancy Journey
3 November 2023 న నవీకరించబడింది
గర్భవతిగా ఉన్నపుడు మామిడిపండ్లు సురక్షితమే. గర్భధారణ సమయంలో మామిడి తినడం గర్భవతులకు అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో అనేక రకాల విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి.
గర్భధారణ సమయంలో నేను మామిడిపండ్లను తినొచ్చా? దీనికి సమాధానం అవును. మీరు నిశ్చింతగా మామిడిపండ్లను తినొచ్చు. మామిడిపండ్లలో అధిక కేలరీలు ఉంటాయి. గర్భధారణ సమయంలో ఒకటి కంటే ఎక్కువ మామిడిపండ్లను తినడం ద్వారా త్వరగా బరువు పెరుగుతారు.
ఐరన్‌ను సంగ్రహించేందుకు అవసరమైన విటమిన్ Cని మామిడిపండ్లు అందజేస్తాయి. అంతకు మించి పిండం అభివృద్ధికి హాని కలిగించే, ప్రాణాంతక కణతులను ఉత్పత్తి చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడడానికి ఇవి సహాయపడతాయి.
మామిడి గర్భానికి మంచిదేనా? అవును.. గర్భధారణ సమయంలో మామిడిని తీసుకోవడం సురక్షితమే. విటమిన్ C పొందేందుకు మామిడిపండ్లు కూడా గొప్ప మార్గం. మీరు ప్రతి రోజు తీసుకోవాల్సిన 100 శాతం విటమిన్‌ను ఒక కప్పుకు సమానమైన మామిడి అందిస్తుంది.
చాలా మామిడిపండ్లలో విటమిన్ A కూడా లభిస్తుంది. పుట్టినపుడు విటమిన్ A తక్కువగా ఉంటే రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. దీని వల్ల డయేరియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
గర్భిణీ స్త్రీల ఆహారంలో మామిడిపండ్లు గొప్పగా ఉంటాయి. అయితే వాటిని తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఇతర పండ్లతో కలిపి తినాలి.
మామిడిలో కేలరీలు అధికంగా ఉన్నందున మహిళలు త్వరగా బరువు పెరుగుతారు కాబట్టి మామిడిపండ్లను రోజుకు ఒకటి కంటే ఎక్కువ తినకూడదని సిఫారసు చేయబడింది. అంతే కాకుండా గర్భధారణ సమయంలో పచ్చి మామిడిని మితంగా తీసుకోవడం మంచిది.
మామిడిపండ్లు డయేరియా, డీహైడ్రేషన్‌కు కారణం అవుతాయి. గర్భధారణ సమయంలో మామిడిని సమతుల్యంగా తీసుకుంటే డీహైడ్రేషన్‌ను నివారించవచ్చు.
మామిడిపండ్లలోని చెక్కెర మధుమేహానికి కారణం కావొచ్చు.
మామిడిపండ్లలో పిండిపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కావున గర్భవతిగా ఉన్న సమయంలో తింటే తొందరగా బరువు పెరుగుతారు.
కొంత మంది మామిడి పండు మీద ఉండే పైతొక్క వల్ల లేదా రసం వల్ల అలెర్జీ వస్తుంది. మీ చర్మం దానికి స్పందిస్తే ఆ పండుని దూరం పెట్టండి. రసాయనాలు వాడి పండబెట్టిన మామిడిపండ్లు తల్లి మరియు బిడ్డ ఇద్దరికీ ప్రమాదాన్ని కలుగజేస్తాయి.
మామిడి పండ్లను ఒక బకెట్ నీటిలో వేయండి. అవి కిందకు మునిగితే అవి సహజంగా పండినట్లు లెక్క. అలా కాకుండా మామిడిపండ్లు తేలుతూ ఉంటే వాటిని పండించేందుకు రసాయనాలను వాడారని అర్థం చేసుకోవాలి. కృతిమంగా పండిన మామిడిపండ్ల నుంచి రసం బయటకు కారదు.
మామిడిపండ్లలో చాలా కేలరీలు ఉంటాయి. మీకు మూడో త్రైమాసికంలో చాలా ఎక్కువ కేలరీలు అవసరం అవుతాయి. అప్పుడు మామిడి మీకు గుడ్ స్నాక్‌గా ఉపయోగపడుతుంది. కానీ.. ఇతర అన్ని పండ్ల వలే గర్భధారణ సమయంలో మామిడిని కూడా మితంగానే తీసుకోవాలి.
మీరు స్మూతీ, లస్సీ, షేక్, లేదా డెజర్ట్ (భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థం)లో భాగంగా మామిడి పండ్లను ఇష్టపడితే.. అదనపు స్వీట్నర్స్, క్రీమ్స్ నుంచి వచ్చే కేలరీలు మరియు అదనపు చెక్కెరల గురించి అవగాహన కలిగి ఉండండి. ఎండిన మామిడి, చట్నీలు, మురబ్బా, క్యాండిడ్ మ్యాంగోస్ అన్నింటిలో తీపి పదార్థాలను కలుపుతారు. కాబట్టి వాటిని అప్పుడపుడు మాత్రమే తినండి.
మార్కెట్లో మామిడి పండ్లు కొనుగోలు చేసే సమయంలో ఎటువంటి మామిడి పండ్లను కొనాలనే దానిపై శ్రద్ధ వహించండి. వివిధ రకాల రసాయనాలతో పండించిన మామిడిపండ్లను కొనుగోలు చేయకండి. సీజన్లో మాత్రమే మామిడిపండ్లను కొనుగోలు చేయండి. అప్పుడు మామిడిపండ్లు కృతిమంగా పండే అవకాశం తగ్గుతుంది.
మామిడి పండ్లు చెట్ల మీద పెరుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇవి మాంసం లేదా కూరగాయల వంటివి కావు. అవి లభించే సీజన్లో మాత్రమే మీరు వాటిని తినగల్గుతారు.
గర్భవతిగా ఉన్నపుడు నేను మామిడిని తినవచ్చా? శుభవార్త ఏమిటంటే.. మీరు గర్భవతిగా ఉన్నపుడు పచ్చి లేదా పూర్తిగా పండిన మామిడిని కూడా తినవచ్చు.
గర్భధారణ మొదటి త్రైమాసికంలో మామిడిని తీసుకోవడం గర్భవతులకు చాలా మంచిది. మీ చర్మాన్ని మెరిసేలా తయారు చేస్తాయి. అంతే కాకుండా ఆసిడిటీ మార్నింగ్ సిక్నెస్ తగ్గేలా సహాయం చేస్తాయి. మీకు అనేక విషయాల్లో సహాయం చేసే అనేక రకాల విటమిన్లు ఇందులో ఉన్నాయి. మీ బిడ్డ ఎదుగుదలకు కావాల్సిన పోషకాలను ఇవి అందిస్తాయి.
గర్భధారణలో పూర్తిగా పండిన మామిడిని తినడం గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఎందుకంటే అవి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తాయి. పగటిపూట మీ ఆకలిని తక్కువ చేస్తాయి. వీటిలో ఫైబర్ ఉంటుంది. దీని వల్ల మీ జీర్ణవ్యవస్థ సరిగ్గా పని చేస్తుంది. ఏది ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్తుంది.
గర్భధారణ సమయంలో మూడు త్రైమాసికాల్లో కూడా స్మూతీస్ తీసుకోవడం సురక్షితం. మీరు గర్భంతో ఉన్నపుడు మామిడిపండు-పాలకూర స్మూతీని కావాలని అనుకున్నా లేదా క్రీమీగా కోరుకున్నా అధిక ప్రొటీన్ల కోసం ఇవి రెండూ సరైనవే.
Yes
No
Written by
Kakarla Sirisha
Get baby's diet chart, and growth tips






డెలివరీ తర్వాత రొమ్ము పరిమాణాన్ని తగ్గించడానికి 8 మార్గాలు | 8 Steps to Reduce Breast Size After Delivery in Telugu

మీ బేబీ డైట్‌కు క్రమంగా కొత్త ఆహార పదార్థాలను చేర్చడం ఎలా? |How To Gradually Incorporate New Food Items Into Your Baby in Telugu

ఉత్తమ బేబీ ఫుడ్ చార్ట్(శిశు ఆహార పట్టిక) అంటే ఏమిటి?| What is An Ideal Baby's Food Chart in Telugu

పాపిల్లరీ థైరాయిడ్ కార్సినోమా (Papillary Thyroid Carcinoma in Telugu)

మహిళలకు బరువు తగ్గించే 24 చిట్కాలు (24 Weight Loss Tips for Women in Telugu)

అమెనోరియా: అర్థం, లక్షణాలు & కారణాలు (Amenorrhea: Meaning, Symptoms, & Causes in Telugu)

Mylo wins Forbes D2C Disruptor award

Mylo wins The Economic Times Promising Brands 2022
Baby Carrier | Baby Soap | Baby Wipes | Stretch Marks Cream | Baby Cream | Baby Shampoo | Baby Massage Oil | Baby Hair Oil | Stretch Marks Oil | Baby Body Wash | Baby Powder | Baby Lotion | Diaper Rash Cream | Newborn Diapers | Teether | Baby Kajal | Baby Diapers Pants | Cloth Diapers | Laundry Detergent | Lactation Granules |